![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 04:39 PM
తమ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని రోడ్లపై తిప్పారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. మహేశ్వర్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్, ధన్‌పాల్ సూర్యనారాయణ తదితరులు నిరసన తెలిపారు.మంగళవారం ఉదయం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అసెంబ్లీ వద్దకు తీసుకువచ్చారు.