|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:11 PM
రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రానున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం జాతీయ నేతలు కూడా వస్తున్నారని ఆయన వెల్లడించారు. పది రోజుల్లో రెండు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని, ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో మరో సభ నిర్వహిస్తామని అన్నారు.