|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 01:51 PM
హుస్నాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ ఏర్పాటు పోరాటం ఆత్మగౌరవంతో కూడుకున్నదని, రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అధికారులపైన, రాజకీయ నాయకులపైన, వారి కుటుంబ సభ్యులపైన ఫోన్ ట్యాపింగ్ చేయడం నీచమైన నేరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విచారణకు పిలిస్తే రాద్ధాంతం చేస్తూ, హింసాత్మక నిరసనలకు పిలునిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. విచారణ జరిగితే కొంతమంది జీవితాల్లో ఆర్థిక, వ్యాపార, రాజకీయ, ఉద్యోగ, కుటుంబాల పరంగా వారి రహస్యాల్లోకి తొంగిచూసి ఫోన్ ట్యాపింగ్ చేసి సమాచారాన్ని సేకరించారని ఆయన పేర్కొన్నారు.