|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 12:33 PM
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడింది. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల మాడల్ కోడ్ అమలులో ఉండటం, అధికారులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. ప్రజలు వినతుల కోసం కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు. పురపాలక ఎన్నికల తర్వాత ప్రజావాణి నిర్వహణపై మరోసారి ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు.