|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:13 PM
బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాత, గత నాలుగైదు రోజులుగా పసిడి, వెండి ధరలు నేలచూస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఒక్కరోజే బంగారం ధర రికార్డు స్థాయిలో పడిపోయింది. ఈ పరిణామం పెట్టుబడిదారులకు షాక్ ఇవ్వగా, కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది.ఈరోజు (ఫిబ్రవరి 2) ఉదయం 9:30 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.9,050 తగ్గి రూ.1,51,530కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.8,300 తగ్గి రూ.1,38,900 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అక్కడ 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,51,680గా నమోదైంది.