|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 12:40 PM
మత్స్యకారులకు చేపల వేటే జీవనాధారం. ప్రతీ రోజూ ఏదొ రకంగా చేపలను ఇంటికి తీసుకెళ్లాల్సిందే. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామంలో చెరువుల వద్దకు చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేపలు చిక్కాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అరుదైన చేప వలకు చిక్కింది. చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామ చెరువులో ఇది దొరికింది. మత్స్యకారులు చేపలు పడుతుండగా బంగారు వర్ణంలో ఉన్న చేప కనిపించింది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఈ చేప.. వలకు చిక్కడంతో మత్స్యకారుల ముఖాలు వెలిగిపోయాయి. బంగారు తీగ చేపగా దీన్ని చెబుతున్నారు మత్స్యకారులు. ఈ అరుదైన చేపను వేలం పాట వేయగా పదివేల రూపాయలు పలికింది. కైతాపురం గ్రామస్తుడే.. ఈ బంగారు తీగ చేపను దక్కించుకున్నాడు. ఇలాంటి చేపలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయంటున్నారు మత్స్యకారులు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న చేప దొరికిన ఈ చెరువులోనే రాకాసి చేపలు కూడా ఉన్నాయంటున్నారు జాలర్లు. రాకాసి చేపలు చూడ్డానికే భయంకరంగా ఉంటే.. బంగారు తీగ మాత్రం తళతళ మెరిసిపోతూ ఆకట్టుకుంది.