|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 12:13 PM
TG: హైదరాబాద్ చర్లపల్లి రైల్వేట్రాక్‌పై తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. తల్లి ఇలాంటి ఘోర నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఒంటరితనమే కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలు చేతన రెడ్డి, విశాల్ రెడ్డిని కారులో చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. పార్కింగ్‌లో కారు పెట్టి 'తనకు జీవించాలని లేదని, తాను లేకపోతే పిల్లలు ఒంటరవుతారని' సూసైడ్ నోట్ రాసి కారులో వదిలేశారు. అదే లేఖను ఫొటో తీసి తన వాట్సప్ స్టేటస్‌గా కూడా పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. కాగా ఆదివారం సాయంత్రం బీబీనగర్‌లో వీరి అంత్యక్రియలు జరిగాయి.