సచివాలయంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రకటన చేశారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మిస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది అంతా చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి సూచించారు. త్వరలోనే అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీవో విడుదల కానుందని తెలిపారు.