బౌన్సర్లకు, వారిని సప్లై చేసే ఏజెన్సీలకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లు పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే వారి తాటతీస్తామని సీవీ ఆనంద్ హెచ్చరించారు.
ఇకపై బౌన్సర్లు పోలీసులను ముట్టుకుంటే చర్యలు తప్పవని అన్నారు. పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. ఊరుకునేది లేదని అన్నారు. బౌన్సర్ల ప్రవర్తనకు సప్లై ఏజెన్సీలదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు.