ఎస్సీ వర్గీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సర్వే లో గోసంగి కులం పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు తీవ్ర వేదనకు గురి చేసిందని గోసంగి కుల రాష్ట్ర అధ్యక్షులు మల్లెల సాయి చరణ్ అన్నారు. బుధవారం మెట్పల్లి పట్టణంలో గోసంగి కుల సభ్యుల ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశంను నిర్వహించారు. దళిత జాతిలో అత్యధిక జనాభా కలిగి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎదిగిన మాదిగ సోదరులు మాలలతో కలిసి ఉండలేక వర్గీకరణ కోరుకున్నారన్నారు. మాదిగలు కోరుకున్న వర్గీకరణను గోసంగి కుల సభ్యులు స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గోసంగి కులానికి సంబంధించిన జనాభాను 23,351 గా చూపడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గోసంగి కులాన్ని మాలల ఉప సంఘం గా చేర్చడం వల్ల తీవ్ర అన్యాయానికి గురి చేసింది అన్నారు. ప్రభుత్వం 2011 జనాబా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే మరి 2024లో కులగణానను ఎందుకు చేశారని ప్రశ్నించారు. తమ జనాభా ఆధారంగా రిజర్వేషన్లను కల్పించాలన్నారు. జస్టిస్ షమీం అక్తర్ కమిషన్కు అన్ని ఉపకులాలు మాల,మాదిగలతో సంబంధం లేకుండా ప్రత్యేక విభాగం ఉండాలన్నారు. కానీ కమిషన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ, రాజకీయ రంగాలలో మా స్థితిగతులను తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు. 2024 జనాభా లెక్కల ప్రకారం గోసంగి కులానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గోసంగి కులానికి ప్రత్యేక గ్రూపును కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేష్ ఉపాధ్యక్షులు రవీందర్ కోశాధికారి అంకమల్ల రమేష్ అధికార ప్రతినిధి కులమడుగు తిరుపతి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు కుమ్మరి రామస్వామి ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్ జిల్లా నాయకులు కలమడుగు రమేష్ శ్యామ్ లక్ష్మీనారాయణ కనకయ్య నరేష్ అశోక్ వీరస్వామి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa