ఖమ్మం1టౌన్ బిజెపి పార్టీ అధ్యక్షులు గడీల నరేష్ అధ్యక్షతన ముస్తఫా నగర్ , గుర్రాల బొమ్మల సెంటర్ నందు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు బేతి సుభాష్ రెడ్డి , సన్నే ఉదయ్ ప్రతాప్ , శీలం పాపారావు లు పాల్గొని పూలమాలు వేసి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16 సంవత్సరాల వయసులోనే యుద్ధ భూమిలో 300 పై చిలుకు యుద్దాలు చేసి చరిత్రలో నిలిచిన వీరుడు అని కోనియడారు .
అధ్యక్షులు గడీల నరేష్ స్థానిక 1 టౌన్ నందు ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వన్ని కొరతమని తెలుపినారు . అలాగే హిందువుల ఆరాధ్య దైవం మరాఠా యోధుడు భారత దేశ కీర్తి ప్రతిష్టలు ఎలుగెత్తి చాటిన మహా యోధుడని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సరస్వతి , శేఖర్ , శ్రీను తదితరులు పాల్గొన్నారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa