ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే ఆందోళన చెందుతాం. ఎవరిని సంప్రదించాలో తెలియక సతమతమవుతాం. ఇటువంటి సమస్య ఎదుర్కొనే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది.
* చిరిగిన, నకిలీ నోట్లు మార్చుకోవడానికి ఎక్కడి ఏటీఎం, విత్ డ్రా స్లిప్, టైం తదితర వివరాలతో సంబంధిత బ్యాంకులో దరఖాస్తు చేయాలి.
* ఓ వ్యక్తి గరిష్ఠంగా 20 నోట్లు రూ.5 వేల లోపు మార్చుకోవచ్చు.
* కరెన్సీ నోటుపై సీరియల్ నెంబర్, గాంధీ వాటర్ మార్క్, గవర్నర్ సంతకం లేకున్నా అది ఫేక్ గా పరిగణించాలి.
* ఒకవేళ బ్యాంకు నోట్లు మార్చేందుకు నిరాకరిస్తే రూ.10 వేల జరిమానాతో పాటు చర్యలు తీసుకుంటారు.