స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఒకేరకమైన ఛార్జింగ్ పోర్ట్‌ను అమర్చడాన్ని దశలవారీగా తీసుకువచ్చేందుకు కంపెనీలు, తయారీ పరిశ్రమ సంఘాలు ఒప్పుకున్నాయని వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వేరబుల్స్ అన్నింటికీ కూడా ఒకే రకమైన ఛార్జింగ్ పోర్ట్‌లను తీసుకొచ్చేందుకు పరిశీలిస్తున్నామంది. దీని వల్ల ఈ-వ్యర్థాలు తగ్గుతాయి. ఇక ఫీచర్ ఫోన్లకు మాత్రం ప్రత్యేక పోర్ట్ ఉండనుంది.