ఎస్ఎంఎస్ మోసాలను నివారించేందుకు టెలికాం శాఖ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. సిమ్ కార్డ్ అప్ గ్రేడ్, ఎక్స్ ఛేంజ్ జరిగే క్రమంలో ఎస్ఎంఎస్ సేవలను నిలిపేయాలని జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలను ఆదేశించింది. సిమ్ యాక్టివ్ అయిన 24 గంటల వరకూ ఇదే స్థితి కొనసాగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టెలికాం సంస్థలకు 15 రోజుల గడువు ఇచ్చింది.