ఫేస్ బుక్ లో ఖాతా తెరిచేందుకు పేరు, వయసు, చిరునామా, మతం వంటి వాటితో పాటు అభిరుచులు, ఇష్టమైన ప్రాంతాలు అంటూ చాలా పెద్ద జాబితానే నింపాల్సి ఉంటుంది. ఇవి యూజర్లకు విసుగు తెప్పిస్తోన్న నేపథ్యంలో కొన్ని కాలమ్స్ తొలిగించాలని మెటా నిర్ణయించింది. ఇకపై యూజర్లు మతపరమైన, రాజకీయపరమైన అభిప్రాయాలతో పాటు చిరునామా, జెండర్ వంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పటికే వివరాలు సమర్పించిన వారికి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు పంపుతోంది.