కంప్యూటర్, మొబైల్, యాప్స్‌కు చాలా మంది సులువైన పాస్‌వర్డ్‌లనే పెట్టుకుంటుంటారు. సింపుల్ పాస్‌వర్డ్స్‌ను క్రాకింగ్ సాప్ట్‌వేర్‌లు తొందరగా కనిపెడతాయి. హ్యాకర్లు వాటిని ఉపయోగించి మీ వ్యక్తిగత సమాచారంతో బ్యాంకు ఖాతాల్లో నగదును గుల్ల చేస్తారు. అయితే, పాస్‌వర్డ్స్‌ను అప్పర్‌కేస్, లోయర్‌కేసు అక్షరాలు, అంకెలు, సింబల్స్ కాంబినేషన్‌తో కనీసం 8 కేరక్టర్స్ తగ్గకుండా పెట్టుకోవాలి. ఎన్ని కేరక్టర్స్ ఉంటే మీ పాస్‌వర్డ్ అంత సురక్షితం. అన్ని కాంబినేషన్స్‌తో 10 కేరక్టర్ల పాస్‌వర్డ్ పెడితే.. దాన్ని క్రాక్ చేయడానికి దాదాపు 5 నెలల సమయం పడుతుంది. అలాగే అన్నింటికి ఒకే పాస్‌వర్డ్ పెట్టుకోవద్దు.