వన్ ప్లస్ బడ్జెట్ ఫోన్ల కేటగిరీలో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. నార్డ్ సీఈ 3 పేరుతో రానున్న ఈ ఫోన్ ను వచ్చే ఏడాది లాంచ్ చేయనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ లో బ్యాక్ కెమెరా 108 మెగా పిక్సెల్ సామర్థ్యంతో ఉంటుందని సమాచారం. 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందుబాటులో ఉంచనున్నారు. బ్లాక్ ఫినిష్‌తో కూడిన హోల్ పంచ్ డిస్‌ప్లేతో, వన్‌ప్లస్ ఎక్స్ డిజైన్ ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 డిజైన్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.25 వేల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.