ఎలక్ట్రిసిటీ బిల్లును పేటీఎం నుండి చెల్లించుకునే ఆప్షన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి నెలా గుర్తు పెట్టుకొని చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రతినెలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పేటీఎం ఆటోపే ఆప్షన్ తీసుకొచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రతి నెలా బిల్లు జారీ అయిన వెంటనే చెల్లింపులు జరిగిపోతాయి. దీనికోసం ముందుగా పేటీఎం యాప్ తెరిచి అందులో సెట్టింగ్స్ కు వెళ్లాలి. రీచార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని, ఎలక్ట్రిసిటీ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. రాష్ట్రం, ఎలక్ట్రిసిటీ బోర్డును ఎంపిక చేసుకొని కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్ ను నమోదు చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ ఇచ్చి ప్రొసీడ్ ను క్లిక్ చేయాలి. చివరగా యూపీఐ ఆటోపే ను ఎంపిక చేసుకోవాలి.