ప్రముఖ సోషల్ మీడియా వాట్సాప్‌లో డిజిటల్ అవతార్‌లను మెటా అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా వాట్సాప్ వినియోగదారులు తమ పర్సనలైజ్డ్ అవతార్‌లను ప్రొఫైల్ ఫొటోలుగా, చాట్స్‌లో స్టిక్కర్లుగా ఉపయోగించుకోవచ్చు. వివిధ రకాల భావోద్వేగాలను ఒలికించే 36 రకాల స్టిక్కర్లలో వేటినైనా ఎంచుకోవచ్చు. అవతార్ అంటే మన స్వరూపాన్ని డిజిటల్ వెర్షన్‌లో సృష్టించుకోవడమే. కోట్ల రకాల హెయిర్ స్టెల్స్, ఫేషియల్ ఫీచర్స్, అవుట్‌ఫిట్ల కలయికతో ఇది సృష్టించబడుతుంది.