మన పర్సనల్ డేటాను ఎవరూ చూడకుండా స్మార్ట్ ఫోన్లకు పాస్ వర్డ్ పెడుతుంటాం. అది మర్చిపోతే ఈ పద్ధతుల్లో దాన్ని అన్ లాక్ చెయ్యొచ్చు. మీ ‘గూగుల్’ ఖాతా నుంచి పాస్ వర్డ్ రీసెట్ చేయడంతో డేటాను కోల్పోకుండా మొబైల్ అన్ లాక్ చెయ్యొచ్చు. దీని కోసం మొబైల్ పాస్ వర్డ్ మర్చిపోతే మొబైల్ లో చాలాసార్లు అన్ లాక్ చేసేందుకు ట్రై చేయండి. దీంతో ఫర్ గాట్ పాస్ వర్డ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ నమోదు చేసి.. ఆ తర్వాత సెట్ న్యూ పాస్ వర్డ్ పై క్లిక్ చేస్తే మొబైల్ కు కొత్త పాస్ వర్డ్ అప్ డేట్ అవుతుంది.