ఆటోమైబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకువస్తుంది. సీఈ-04 ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఢిల్లీలో జరిగిన జాయ్ టౌన్ ఈవెంట్ లో ఆవిష్కరించారు. ఈ స్కూటర్ లో 8.9 కిలోవాట్ అవర్ లిథియం బ్యాటరీ అమర్చారు. ఇది 42Hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ 2.6 సెకన్లలోనే 50కి.మీల వేగం అందుకుంటుంది. ఈ బైక్ ను ఒక్కసారి చార్జి చేస్తే 130కి.మీ ప్రయాణించవచ్చు. దీంట్లో బ్యాటరీ పూర్తిగా అయిపోయినప్పుడు 100 శాతం చార్జ్ అవ్వడానికి 2.3KW ఛార్జర్ తో అయితే 4 గంటల 20 నిమిషాలు, అదే 6.9KW అయితే 1 గంట 40నిమిషాలు పడుతుంది. దీన్ని వచ్చే ఏడాది జనవరిలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు.