కొంతమంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా కఫం వల్ల జలుబు, దగ్గు వంటి వ్యాధులు వస్తాయి. అలాంటి వాటికి లవంగం టీతో చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. లవంగాలు, చిన్న అల్లం, దాల్చిన చెక్కలను తీసుకుని రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించి వడకట్టాలి. నీరు వెచ్చగా మారిన తర్వాత అర చెంచా తేనె కలిపి తీసుకుంటే కఫం నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు.