శ్రీలంక క్రికెట్ బోర్డుకు కోర్టులో భారీ ఊరట లభించింది. బోర్డు సభ్యులు రెండు వారాల పాటు పదవిలో ఉండేందుకు కోర్టు అంగీకరించింది. క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ అధ్యక్షుడు షమ్మి సిల్వా కోర్టును ఆశ్రయించారు. దాంతో రెండు వారాల తర్వాత విచారణ చేపడతామని, అప్పటివరకు బోర్డు సభ్యులు పదవిలో కొనసాగుతారని న్యాయస్థానం పేర్కొంది.