న్యూజిలాండ్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్‌పై బంగ్లాదేశ్ భారీ విజయాన్ని అందుకుంది. తొలి టెస్టులో టిమ్ సౌథీ 150 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసి చరిత్ర సృష్టించాడు. రెండు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 28న సిల్హెట్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆతిథ్య బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ 317 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యం సాధించింది. బంగ్లాదేశ్ 338 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను ముగించగా, కివీస్ 181 పరుగులకే ఆలౌటైంది.
ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/24) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఓవర్‌నైట్ స్కోరు 212/3తో శుక్రవారం ఆటను పునఃప్రారంభించిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (67), మెహదీ హసన్ మిరాజ్ (50 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. ఐదో రోజు ఆటలో భాగంగా కివీస్ విజయానికి ఇంకా 219 పరుగులు చేయాల్సి ఉండగా.. స్పిన్నర్ నయీమ్ హసన్ తొలి వికెట్.. తైజుల్ మరో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ఓటమిని ఖరారు చేశాడు.