పోలీసులే అర్థరాత్రి దొంగల్లా ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నారని, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయని వైఎస్సార్సీపీ నేత చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. గౌతమ్‌రెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే పోలీసులే ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా డీజీపీ? అని ప్రశ్నించారు. ఈ రకమైన చర్యలు అప్రజాస్వామికమని, అర్థరాత్రి మహిళలున్న సమయంలో ఇళ్లల్లోకి పోలీసులు ప్రవేశించడం కరెక్టేనా? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం నిర్బంధకాండను ప్రజలు తెలుసుకోవాలని, అక్రమ కేసులపై వైయస్ఆర్సీపీ న్యాయపోరాటం చేస్తుందని వైఎస్సార్సీపీ నేత చంద్రశేఖర్ పేర్కొన్నారు.