కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డీఎస్సీ ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేస్తారని పల్లా శ్రీనివాస్ అడగగా, వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రక్రియ పూర్త్తి చేస్తామని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ప్రభుత్వం మారడానికి టీచర్లే కారణం. ఆ రోజు ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి వారి హక్కుల కోసం పోరాటం చేశారు.
ఆ రోజు నుంచి ప్రజలకు కూడా ధైర్యంవచ్చి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఆ కోపంతో టీచర్లపై తప్పుడు కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం వేధించింది’’ అని లోకేశ్ గుర్తు చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 6లక్షలమంది విద్యార్థులు తగ్గారన్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలల విలీనం, టీచర్లపై పనిభారం పెంచడం చేస్తూ తెచ్చిన వివాదాస్పద జీవో 117కు మార్పు చేసే దిశగా పని చేస్తున్నామని, వివిధ సంఘాలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయులకు సమయం కేటాయించి ప్రతివారం వారి సమస్యలు తెలుసుకుంటున్నామని, క్షేత్రస్థాయి అంశాలు దానివల్ల తమకు తెలిసే అవకాశం లభించిందని లోకేశ్ తెలిపారు.