ఏపీ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆసక్తికర ఘటన జరిగింది. డిప్యూటీ స్పీకర్‌గా నియమితులైన రఘురామకృష్ణరాజు శుక్రవారం సభను నడిపించారు. అయితే స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జ్యోతుల నెహ్రు ప్రసంగాన్ని రఘురామకృష్ణరాజు అడ్డుకోవడంతో నెహ్రూ మనస్థాపానికి గురయ్యారు. తానేమీ ప్రతిపక్షం కాదని.. మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానన్నారు. అసెంబ్లీకి రావద్దంటే రానంటూ జ్యోతుల నెహ్రూ ఎమోషనల్ అయ్యారు. ఐదు నిమిషాలు కూడా మాట్లాడనివ్వకపోతే ఎలా అంటూ జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. తనను ప్రతిపక్షంగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు.