ఉత్తమ జర్నలిస్ట్ సాంప్రదాయాలు పాటించమని, మా స్పందన కూడా ప్రసారం చెయ్యాలని చెప్పా.. నువ్వు అసలు చిత్తశుద్ధి కలిగిన వృత్తిపరమైన పాత్రికేయుడివేనా? అంటూ ఎక్స్ వేదికగా ఏబీఎన్ రాధాకృష్ణను వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.‘‘నన్ను 2012లో సీబిఐ అరెస్ట్ చేసినప్పుడు మా ఇల్లు, ఆఫీస్ రైడ్ చేసి ఫైల్స్, అన్నిపత్రాలు స్వాధీనం చేసుకుని పూర్తిస్థాయి విచారణ జరిపారు. 12 నెలలు, కాంగ్రెస్-టీడీపీ కుట్రలో భాగంగా, జైల్లో గడిపాను. "ఆదాయానికి మించి ఆస్తులు" అభియోగాలు లేవు. నా పైన పెట్టిన సెక్షన్లు కుట్ర, ప్రేరేపణ, ఖాతా లెక్కల ఫడ్జింగ్ మాత్రమే. నీలాగ మోసగాడినో, దోపిడీదారునో, బ్లాక్ మైలర్ నో, వీలర్ డీలర్ నో కాదు. గుర్తుంచుకో!’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
నీలాగా మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర, ఖనిజాల సిండికేట్ బ్రోకర్ల దగ్గర ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి వారికీ ఇవ్వాలని నెల నెలా కోట్లకు కోట్లు నేను తీసుకోలేదు. ఇప్పుడు 2024లో విజయసాయి రెడ్డి అనే నేను నువ్వు చెప్పే భూదందాలు, భూముల ఆక్రమణలు పై సిబిఐ, ఈడీ విచారణకు సిద్ధం. నువ్వు సిద్ధమేనా వేమూరి రాధాకృష్ణా? ఇద్దరం కలసి జాయింట్‌గా కేంద్రవిచారణా సంస్థలకు విచారణకు పిటిషన్ పెట్టుకుందాం! సిద్ధమా!. సాధారణ విలేకరిగా ఇంత సంపద పోగేసుకున్నావ్, సీఏ చదివిన ఆడిటర్‌గా ప్రాక్టీసుతో ఈ స్థాయికి నేను వచ్చాను. ఎవరెలా సంపాదించారో తెలుగు ప్రాంతాల బయట నాతో చర్చకు సిద్ధమా? రాధాకృష్ణా’’ అంటూ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.