జూనియర్ మహిళల హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు.. కొరియాపై ఘన విజయం సాధించింది. చిలీలో జరుగుతున్న ఈ టోర్నీలో 9వ, 12వ క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 3-1 స్కోర్ తేడాతో కొరియాను చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత అమ్మాయిలు కొరియా గోల్‌పోస్ట్‌పై దాడికి దిగారు.
19వ నిమిషంలో కొరియా ప్లేయర్ జియోన్ చోయ్ గోల్ చేశాడు. అయితే ఆ ఆనందం కొరియాకు ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే..? ఆ తర్వాత ఎదురుదాడితో టీమిండియాకు షాకిచ్చింది. 23వ నిమిషంలో రోప్ని కుమారి తొలి గోల్ చేసి స్కోరును సమం చేసింది. అక్కడి నుంచి మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. 44వ నిమిషంలో ముంతాజ్ ఖాన్ గోల్ కొట్టిన తర్వాత కొరియా ఆటగాళ్లు డిఫెన్స్ కే పరిమితమయ్యారు. ఆఖర్లో అన్నూ 46వ నిమిషంలో గోల్ చేయడంతో టీమ్ ఇండియా 3-1తో విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ సిలో భారత్ 9వ స్థానంలో నిలిచింది.తదుపరి మ్యాచ్ లో భారత జట్టు చిలీ లేదా అమెరికాతో తలపడనుంది.