భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని, టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు కూర్పుపై ఓ క్లారిటీ వస్తుందని అందరూ భావించారు. అయితే అభిమానులందరినీ వరుణుడు నిరాశపరిచాడు. వర్షం కారణంగా మ్యాచ్ టాస్ లేకుండానే రద్దయింది. అయితే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానం మొత్తాన్ని కవర్స్ తో కప్పి ఉంచనందకు మండిపడ్డాడు.
“గ్రౌండ్ మొత్తం కవర్లు వేయకపోతే వర్షం ఆగిన తర్వాత కూడా ఆట కోసం మరో గంట వేచి ఉండాల్సిందే.. అంతేకానీ మళ్లీ హఠాత్తుగా వర్షం కురిస్తే ఆట కొనసాగదు.. అన్ని దేశాల క్రికెట్ బోర్డుల వద్ద బోలెడన్ని ఉన్నాయి. డబ్బు.. నో చెబితే అబద్ధాలు చెబుతున్నారు.. సౌతాఫ్రికా బోర్డు వద్ద బీసీసీఐకి ఉన్నంత డబ్బు లేకపోవచ్చు.. కానీ, ఫీల్డ్ మొత్తం కవర్ చేయడానికి కవర్లు కొనేందుకు డబ్బు ఉంటుందా?’’ అని గవాస్కర్ అన్నారు.