దక్షిణాఫ్రికా గడ్డపై పొట్టి ఫార్మాట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమైన టీమిండియాకు వరుణుడు అడ్డుగా నిలుస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. డర్బన్‌లో జరిగిన ఈ మ్యాచ్ టాస్ లేకుండా ముగియడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ క్రమంలో మంగళవారం సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరగనున్న రెండో టీ20పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్‌కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. రెండో టీ20 వేదిక పోర్ట్ ఎలిజబెత్ పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, నగరమంతా మేఘావృతమై ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం పోర్ట్ ఎలిజబెత్‌లో ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
టీమిండియా: యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేష్ కుమార్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్కే, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్, తబ్రేజ్ షంసీ.