మిర్పూర్ పిచ్ అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ పిచ్ కాదని ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తన నివేదికలో పిచ్ పేలవంగా తయారైందని, పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్ అయిందని, దీంతో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాడు.
ప్రమాదకరమైన పిచ్‌ను తయారు చేసినందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఐసిసి మందలించింది. రిఫరీ బూన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లిఖితపూర్వకంగా తెలియజేశాడు. కాగా, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో న్యూజిలాండ్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బ్యాటర్లకు ఏమాత్రం సహకరించని మిర్పూర్ పిచ్ పై కివీస్ బౌలర్లు కాస్త లాభపడ్డారు.