ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఏకంగా 347 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఘన విజయం అందుకుంది. తొలుత ఇన్నింగ్స్‌లో భారత్ 428, రెండో ఇన్నింగ్స్‌లో 186d పరుగులు చేయగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 136, రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీప్తి శర్మ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9/39 వికెట్లు తీసుకుంది.
దీంతో 2వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. అయితే, మూడో రోజు ఆట ప్రారంభానికి ముందే డిక్లేర్ చేసి ఇంగ్లండ్ జట్టును రెండో ఇన్నింగ్స్‌కు ఆహ్వానించింది. 479 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు తొలి షాక్ ఇవ్వడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. టామీ (17), పూజా వస్త్రాకర్, సోఫియా డంక్లీ (15), నాట్ షివర్-బ్రంట్ (0), హీథర్ నైట్ (21)లను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా రేణుకా సింగ్ తొలి విజయాన్ని అందుకుంది.
మరోవైపు దీప్తి శర్మ డేనియల్ వ్యాట్ (12), అమీ జోన్స్ (5)లను పెవిలియన్‌కు చేర్చింది. ఆ తర్వాత రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్ లో సోఫీ ఎక్లెస్టోన్ (10) వికెట్ కోల్పోయింది. చివరకు ఇంగ్లండ్‌ను కేవలం 131 పరుగులకే ఆలౌట్ చేయడంతో టీమిండియా 347 పరుగులతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.