బంగ్లాదేశ్ అండర్-19 ఆసియా కప్ 2023 ఛాంపియన్‌గా నిలిచింది. దుబాబ్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ 195 పరుగుల తేడాతో యూఏఈని ఓడించింది. తొలి అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ అషికర్ రెహమాన్ షిబ్లీ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 149 బంతులు ఎదుర్కొన్న అషికర్ రెహమాన్ 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 129 పరుగులు చేశాడు. అతడితో పాటు రిజ్వాన్ (60), అరిఫుల్ ఇస్లాం (50) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో అయమన్ అహ్మద్ 4 వికెట్లు తీశాడు. ఒమిద్ రహ్మద్ రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత 283 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. బెంగాల్ బౌలర్ల ధాటికి కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. బెంగాలీ బౌలర్లలో రోహనాథ్, మారుఫ్ మిర్దా చెరో మూడు వికెట్లు తీయగా, ఇక్బాల్, షేక్ ఫవీజ్ రెండేసి వికెట్లు తీశారు. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ భారత్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.