క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న IPL-2024 మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో, దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. 10 ఫ్రాంచైజీల్లో మొత్తం 77 ఖాళీలు ఉండగా, విదేశీ ఆటగాళ్లకు 30 ఖాళీలు ఉన్నాయి. ఈ వేలంలో అనుసరించాల్సిన ప్రణాళికలను ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటికే సిద్ధం చేశాయి.
ఈ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అత్యధిక పర్స్ వాల్యూతో బరిలోకి దిగనుంది. గుజరాత్ టైటాన్స్ వద్ద రూ. 38.15 కోట్ల పర్స్ మనీ ఉంది. ఆ తర్వాత వరుసగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ.34 కోట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ.32.7 కోట్లు) చెన్నై సూపర్ కింగ్స్ (రూ.31.4 కోట్లు), పంజాబ్ కింగ్స్ (రూ.29.10 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.28.95 కోట్లు) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ.23.25 కోట్లు), ముంబై ఇండియన్స్(రూ.17.75 కోట్లు), రాజస్తాన్ రాయల్స్(రూ. 14.5 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్(రూ. 13.15 కోట్లు) ఉన్నాయి.