ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మినీ వేలం కొనసాగుతోంది. ఆస్ట్రేలియా క్రికెటర్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. IPL చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని తాజా మినీ వేలంలో రూ.20.50 కోట్ల ధరకు SRH సొంతం చేసుకుంది. అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్ కర్రన్- 18.5 కోట్లు (2023, పంజాబ్ కింగ్స్) రికార్డును కమిన్స్ తిరగరాశాడు.
ఈ క్రమంలో భారత బౌలర్ హర్షల్ పటేల్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఈ స్టార్ ఆటగాడి కోసం ఏకంగా రూ.11.75 కోట్లు వెచ్చించింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన హర్షల్ పటేల్ కోసం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది.
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడయ్యాడు. ఢిల్లీ, పంజాబ్, చెన్నై జట్లు అతడి కోసం వేలంలో పోటీ పడ్డాయి. రూ.కోటి బేస్ ప్రైస్‌తో ప్రారంభమైన అతడిని చివరికి రూ.14 కోట్లకు చెన్నై జట్టు దక్కించుకుంది.