ఈ ఏడాది 10వ తరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు రానున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆరు పేపర్లకు.. ఆరు పేపర్లకు.. ఏడు రోజుల పాటు పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మెయిన్ సైన్స్ పరీక్షలో అంతర్భాగమైన ఫిజిక్స్, బయాలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహించే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే ఏడు రోజుల పాటు ఆరు పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. రెండేళ్ల క్రితం పదో తరగతి పరీక్ష పేపర్లను 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదించారు. కానీ సైన్స్‌లో బయాలజీ, ఫిజికల్ కెమిస్ట్రీ వేరు వేరు సబ్జెక్టులు.