తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. 11 మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖ పంపారు. కౌన్సిల్లో 27 మంది సభ్యుల బలం ఉన్న వైసీపీ.. 11 మంది సభ్యుల రాజీనామాతో 16కు పడిపోయింది. రాజీనామా చేసిన వారిలో ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్ ఉన్నారు. మున్సిపాలిటీపై వైసీపీ పూర్తిగా పట్టు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. త్వరలో మరి కొంతమంది కౌన్సిలర్లు పార్టీ మారే అవకాశం కనిపిస్తుంది.