తెర్లాం మండలం నందబలగ ఉన్నత పాఠశాలలో పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న 10వ తరగతి విద్యార్థులకు డెల్టా అధ్యక్షుడు ఎం. విజయమోహన్ రావు ప్రత్యేకంగా రూపొందించిన.
ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్ ను ప్రధానోపాధ్యాయులు ఐ. సీతారాం ఉచితంగా బుధవారం అందించారు. సీ, డీ గ్రేడ్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని సులభతర పద్ధతిలో 10వ తరగతి విద్యార్థుల కోసం ఈ స్టడీ మెటీరియల్ను తయారు చేశామని విజయమోహన్ రావు తెలిపారు.