తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన జోలాపురి శంకరావు (45) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆర్థిక సమస్యలు పెరిగిపోవడంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సాయంతో అతనిని గుంటూరు జీజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడు భార్య జోలాపురి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ జోజి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.