విశాఖ నగరం బురుజుపేటలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 2500 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.