ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీర్పూర్ లో సంచలనం సృష్టించిన దోపిడి కేసులో మరొక వ్యక్తి అరెస్ట్..!

Crime |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2024, 04:16 PM

బీర్పూర్ మండలం.బీర్పూర్ కి చెందిన కాసం ఈశ్వరయ్య కిరాణం షాపు పెట్టుకొని జీవిస్తాడు. తేదీ 14.12.2024 రోజున ఉదయం 5.00 గంటలకు నిద్రలేచి బాత్రూమ్ కి వెళ్తుండగా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు మంకీ క్యాప్ లు దరించి తనను అరిస్తే చంపుతామని వాళ్ళ చేతిలో ఉన్న చిన్న తుపాకి తో బెదిరించి ఇంట్లోకి లాక్కెల్లి తనను కొట్టి తన బార్యను కూడా చిన్న తుపాకితో బెదిరించి కట్టేసి, అరవకుండా నోట్లో గుడ్డ కుక్కి వారి వొంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు మరియు డబ్బులను దోపిడి చేసుకొని వెళ్ళినారు. దీంతో బీర్పూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించనైనది.    
దర్యాప్తు లో బాగంగా  జగిత్యాల జిల్లా  ఎస్‌పి అశోక్ కుమార్ ఐ‌పి‌ఎస్  ఆదేశానుసారం , జగిత్యాల డి‌ఎస్‌పి రఘుచందర్ ఆధ్వర్యం లో ప్రత్యేక పోలీసు  బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. పోలీసు విచారణలో కొందరు నిండుతులు ధర్మపురి మండలం లోని తుమ్మెనల గుట్ట దగ్గర ఉన్నారని నమ్మకమైన సమాచారం మేరకు తేదీ.20.12.2024  ఉదయం 11.00 గం.లకు  సహదేవ్ హోటల్ దగ్గర ఆరుగురు నింధితులను అదుపులోకి తీసుకొని పంచుల సమక్షంలో విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు .
వివరాల్లోకి వెళితే మున్నీసుల శ్రీనివాస్, చిప్పబత్తుల తులసయ్య , బక్కెనపల్లి అరుణ్ , యశోద శ్రీనివాస్ , సైదు సహదేవ్, రత్నం మాణిక్యం మరియు ముకునూరి కిరణ్ కుమార్ లు ఒక గ్యాంగ్ గా యేర్పడి కొన్ని రోజుల నుండి కిరణ్ దగ్గర ఉన్న ఒక యంత్రం తో గుప్తా నిదుల కోసం వెతుకుతుండే వారు . ఎక్కడ కూడా గుప్తా నిధులు దొరకకపోవడం తో పై వారంధరు కలిసి ఎవరన్నా బాగా డబ్బులు ఉన్న వారి ఇంట్లో దోపిడి చేసి వచ్చిన డబ్బులతో  జల్సాలు చేసుకుంధమని అనుకోని ఒకరోజు తుమ్మెనల ధగ్గర గల సహదేవ్ హోటల్లో కలిసి బీర్పూర్ లో డబ్బులు, బంగారం ఉన్న  ఒక సేటు కాసం ఈశ్వరయ్య ఇంట్లో తాను, అతని బార్య మాత్రమే ఉంటారు, వారు ముసలి వాళ్ళని, వాళ్ళ ఇంట్లో చొరబడి దోపిడి చేస్తే మనకు డబ్బు, బంగారు అబరణాలు ధోరుకుతాయని పథకం వేసుకొని. తేదీ 13.12.2024 రోజున రాత్రి పై అందరూ తుమ్మెనల ధగ్గర గల సహదేవ్ హోటల్లో కలుసుకొని. మంకీ క్యాప్ లు దరించి బొమ్మ తుపాకీలు పట్టుకొని కిరణ్ కుమార్, అరుణ్, తులసయ్య, మున్నేసుల శ్రీనివాస్ లు ఒక నెంబర్ లేని వైట్ కలర్ access125 స్కూటీ, బ్లాక్ కలర్ passion pro బైక్ ల మీద బీర్పూర్ కి వెళ్ళి అర్ధరాత్రి 2.30 గం. లకు కాసం ఈశ్వరయ్య ఇంటి వెనకాల నుండి గోడ దూకి బాత్రూమ్ దగ్గర జాక్కొని ఉన్నారు. ఉదయం 5.00 గం.లకు ఈశ్వరయ్య బాత్రూమ్ కి వెళ్లడానికి రాగా అతనిని గట్టిగా అధిమి పట్టి బొమ్మ తుపాకితో తల మీద కొట్టి  చంపుతామని బెదిరించి , ఇంట్లోకి ఈడుచుకెళ్లి ఈశ్వరయ్య బార్యను కూడా కొట్టి గుడ్డ పేగులు నోట్లో కుక్కి. వారిని కట్టేశారు. వారి వొంటి మీద ఉన్న బంగారు ఆబరణాలు, ఇంట్లో ఉన్న డబ్బులు దోపిడి చేసుకొని పారిపోయారు.
ఈ కేసులో పరారీ లో ఉన్న ముకునూరి కిరణ్ కుమార్  ఎస్/ఓ బ్రహ్మయ్య ర్ /ఓ పోచమ్మవాడ, మంచిర్యాల అనునతడు ఈరోజు తన భార్య, అన్న వత్తిడి మేరకు జగిత్యాల రూరల్ సీఐ వై. కృష్ణారెడ్డి ముందు లొంగిపోయాడు. నిందితుడినుండి బంగారు పుస్తెలు, మాటీలు, బుట్టాలు, వెండి కాళ్ళ పట్టీలు, నేరం చేయడానికి ఉపయోగించిన యాక్సిస్ 125 స్కూటీ మరియు సెల్ ఫోన్ స్వాధీనపరుచుకొని రిమాండ్ కు తరలించనైనది. ఈ కేసులో దోపిడీకి గురైన మొత్తం బంగారం, వెండి వస్తువులను, నగదును పోలీసులు రికవరీ చేయనైనది.ఈ కేసును ఛేదించడంతో బీర్పూర్ పోలీసులపైన మండల ప్రజలు అభినందనలు కురిపిస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com