మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశం మృతి పట్ల వైయస్ఆర్‌సీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప నేతను కోల్పోయిందని ఆయన అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి విశాఖలో పలువురు వైయస్ఆర్‌సీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖలో మన్మోహన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, రవీంద్ర బాబు, కుంభ రవిబాబు, బొత్స ఝాన్సీ, మంత్రి గుడివాడ అమర్నాథ్, జడ్పీ చైర్మన్ సుభద్ర సహా పార్టీ నేతలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ..‘దేశం గొప్ప నేతను కోల్పోయింది. ఆయన సంస్కరణలు దేశానికి, రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరమని ప్రశంసించారు. అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. పనికి ఆహార పథకాన్ని తీసుకుని వచ్చి పేదల కడుపు నింపారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి. ఆయన మరణం దేశానికి తీరని లోటు అంటూ కామెంట్స్ చేశారు.