తనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను కాకా పట్టామని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విజయనగరంలో బొత్స కుటుంబ పాలన పోయి కూటమి పాలన వచ్చిందని గుర్తుచేశారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను బలహీనపర్చాలనే వైసీపీ ఆలోచన సఫలం కాదన్నారు.
వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ కార్యకర్తలను బలహీనపర్చాలనే వైసీపీ ఆలోచన ఎన్నటికి సఫలంకాదని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ ఆలోచనలతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని అన్నారు. ఇరిగేషన్, వ్యవసాయం, రోడ్ అండ్ బిల్డింగ్స్ విషయాల్లో చిత్తశుద్దితో పరిష్కార మార్గాలు వెతుకుతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.