అన్ని వ్యవస్థలను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. పదవి నుంచి దిగిపోతూ ప్రజలపై జగన్ విద్యుత్ భారం మోపారని ఆరోపించారు. రైతులకు రూ.1,850 కోట్ల మేర ధాన్యం బకాయిలు పెట్టారన్నారు. 3 రాజధానులంటూ అమరావతి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. జగన్ వల్ల అమరావతి నిర్మాణం ఖర్చు రెట్టింపైందని చెప్పారు. ప్రభుత్వ ఆదాయాన్ని జగన్ దోచుకున్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు.