ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 20వ తేదీన మన్యం జిల్లాలో పర్యటించారు. పవన్ పర్యటనలో భద్రతాలోపం లోపించింది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్‌చల్ చేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. భద్రతాలోపాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఆలస్యంగా గుర్తించారు. అసలు నకిలీ ఐపీఎస్ ఎక్కడ నుంచి వచ్చారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.