ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు బిడ్డగా గర్విస్తున్నాను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2024, 08:04 PM

6వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలో సుప్రీంకోర్టు పూర్వపు న్యాయమూర్తి జస్టిస్ యన్.వి.రమణ  పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాష కీర్తి పతాకను ఎగుర వేసెలా సభలు నిర్వహిస్తున్న అందరికీ తెలుగు బిడ్డగా కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు సాహిత్యం, వైభవం గురించి అనర్గళంగా ఇక్కడ మాట్లాడారన్నారు. తెలుగు జాతి అంటే మదరాసీలు కాదని తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారన్నారు.


తెలుగు భాష పరిరక్షణ కోసం రామోజీరావు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. వంద బిలియన్లు మన తెలుగు భాషను మాట్లాడుతుంటారని.. తెలుగు ఉనికి అతి ప్రాచీన భాషగా గుర్తింపు పొందిందన్నారు. పురాణాలు, ఇతిహాసాలు దాటి ప్రజల భాషగా తెలుగు భాష మారిందన్నారు. ఒక సంగీతం తరహాలో అందమైన భాష తెలుగు భాష అని కొనియాడారు. వ్యాపార, రాజకీయ ప్రయోజనాలతో తెలుగు భాషను అణగదొక్కారని విమర్శించారు. తగినంత గుర్తింపు కూడా భాషకు దక్కలేదన్నారు. వాడుక భాషలో మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదని.. తెలుగు భాష వృద్ధిపై మన ప్రభుత్వాలు దృష్టి పెట్టింది లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com