మనం పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్రపిండాలు(Kidneys) ఓవరాల్ హెల్త్‌తో కీలక పాత్ర పోషిస్తాయి.ఇవి రక్తంతో పాటు శరీరంలోని విష వ్యర్థాలను ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తాయి. ఇంతటి కీలకమైన కిడ్నీలకు ఏదైనా జరిగితే, దాని పనితీరు దెబ్బతిని ఓవరాల్ హెల్త్‌పై ఎఫెక్ట్ పడుతుంది. అయితే కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ముందు శరీరంలో కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే వ్యాధి మరింత తీవ్రమై కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారితీస్తుంది. కేవలం మూత్రం ద్వారా మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో చెప్పవచ్చు. ముఖ్యంగా 7 లక్షణాలు కిడ్నీల వైఫల్యాన్ని సూచిస్తాయి. అవేంటంటే..
మూత్రం తక్కువగా
కొన్నిసార్లు మూత్రం తక్కువగా రావడాన్ని మనం పెద్దగా పట్టించుకోం. కానీ, ఇది తరచూ రిపీట్ అయితే మాత్రం అలర్ట్ కావాల్సిందే. సరిగ్గా యూరినేట్ చేయకపోవడం కూడా కిడ్నీ డ్యామేజ్‌కి సంకేతంగా భావించాలి. ఈ సమయంలో రెగ్యులర్ కన్నా తక్కువ మూత్రం వస్తుంది. వాటర్ ఎక్కువగా తాగినా కూడా ఇలా జరుగుతుంటే జాగ్రత్త పడాలి.
బ్రౌన్ యూరిన్మూ
త్రం బ్రౌన్ రంగులో వస్తుందంటే డౌట్ పడాల్సిందే. కిడ్నీల పనితీరు దెబ్బతిన్నప్పుడు మూత్రం డార్క్ బ్రౌన్ రంగులోకి మారుతుంది. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా ఈ సంకేతం కనిపిస్తుంది. మూత్ర విసర్జన సమయంలో మీలో కూడా ఈ సంకేతం కనిపిస్తే వెంటనే సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించండి.
పొడి చర్మం
చర్మం పొడిగా మారడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ, నేషనల్ కిడ్నీ ఫౌండేషన్‌లో పబ్లిష్ అయిన రిపోర్ట్ ప్రకారం.. చర్మం బాగా పొడిగా ఉండి దురద వంటివి కనిపిస్తే అది కిడ్నీ వ్యాధులకు సంకేతం కావొచ్చు.
మూత్రంలో రక్తంమూత్రంలో రక్తపు మరకలు, బుడగలు కనిపించడం కూడా కిడ్నీ వ్యాధులకు సంకేతం. మూత్రంలో లేత ఎరుపు లేదా పింక్ బబుల్స్ వల్ల యూరిన్ రంగు మారుతుంది. రెగ్యులర్‌గా ఈ మార్పును గమనిస్తే వైద్య సహాయం పొందాలి.
వాపు
సాధారణంగా పాదాలు, మోకాళ్లు, చేతివేళ్లు, ముఖం వంటి భాగాల్లో కొన్నిసార్లు వాపు వస్తుంటుంది. అప్పుడప్పుడు కనిపిస్తే ఫర్వాలేదు గానీ రెగ్యులర్‌గా వాస్తున్నాయంటే మాత్రం డౌట్ పడాల్సిందే. కిడ్నీ ఫెయిల్యూర్‌కి ఇది కూడా ఒక సంకేతం కావొచ్చు.
బురుగు మూత్రం
మూత్రం తెల్లగా, బురుగు లేకుండా వస్తే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నట్లు. ఒకవేళ మూత్రం రంగు మారి బురుగు, బబుల్స్‌తో వచ్చినట్లు కనిపిస్తే అది కూడా కిడ్నీ వ్యాధులకు సంకేతం కావొచ్చు. యూరినేట్ చేసేటప్పుడు సరిగా గమనిస్తే ఈ తేడా కనిపిస్తుంది.
నిద్రలేమి
జీవనశైలి మార్పులతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా నిద్రలేమికి దారితీస్తాయి. కిడ్నీ పనితీరు దెబ్బతింటే బాడీలోని విష వ్యర్థాలు బయటకు వెళ్లవు. దీంతో ఈ టాక్సిన్లు స్లీప్ ప్యాటర్న్‌లను దెబ్బతీస్తాయి. రాత్రిపూట ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది