వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసమర్థతతో రాజధాని ప్రాంతం అమరావతి నాశనమైందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ... అమరావతిపై జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే శ్రావణ కుమార్‌తో కలసి సీడ్ యాక్సెస్ రోడ్డు, బైపాస్ రోడ్డు పనులను పరిశీలించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో రోడ్లనిర్మాణ పనులు మూలన పడ్డాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.