రోడ్డు ప్రమాదాల నివారణ కు సీరియస్‌గా ఆలోచించాలని అనంతపురం ఇనచార్జ్ కలెక్టరు శివ నారాయణశర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రోడ్డుప్రమాదాల నివారణపై శుక్రవారం జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఇనచార్జ్ కలెక్టరు మాట్లాడుతూ గత మూడు నెలల్లోనే జిల్లాలో రెండు పెద్ద ప్రమాదాలు జరిగాయన్నారు. ఈప్రమాదాలలో పలువురు చనిపోవడం బాధాకరమన్నారు.
భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమణ మూర్తి, డీటీసీ వీర్రాజు, డీపీఓ నాగరాజునాయుడు, పీఆర్‌ఎస్‌ఈ, జహీర్‌ఇస్లామ్, ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత, డీఎంహెచఓ డాక్టరు ఈబీ దేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టరు వెంకటేశ్వరరావు, హైవే టెక్నికల్ మేనేజరు మురళీకృష్ణ, ఆర్‌అండ్‌బీ ఈ.ఈ జేపీరెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.